ఆది. నవం 18th, 2018

కేరళ వరద బాధితులకు ప్రేమమ్ హీరో భారీ విరాళం..

శతాబ్ధం కాలంలో ఎప్పుడూ లేని విధంగా కేరళను కకావికలం చేసిన వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఇంతకు ముందెప్పుడూ చూడని ప్రళయాన్ని అతి దగ్గరి నుంచి చూసిన జనం ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. లక్షలాది మంది జనం సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. ఎందరో నిరాశ్రయులయ్యారు. తిరిగి ఇంటికి వెళ్లి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సహాయ శిబిరాల్లోనే తలదాచుకుంటూ ఎప్పుడు, ఏం జరుగుతుందా అని చిగురుటాకులా వనికిపోతున్నారు.

ఇదిలావుంటే, కష్టాల్లో ఉన్న కేరళ వాసులను ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన రీతిలో సహాయం అందిస్తున్నారు. మళయాళం సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన యువ నటుడు, ప్రేమమ్ ఫేమ్ నివిన్ పాలి తాజాగా  కేరళ వరద బాధితుల సహాయార్థం రూ.25 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు ఇవాళ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ని కలిసిన నివిన్ పాలి అక్కడే ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్‌ని అందజేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!