ఆది. నవం 18th, 2018

కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయిన నాలుగు లక్షల మంది సైనికుల అస్థికలు ఎక్కడ ఉన్నాయి.?

భారతదేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద సంగ్రామమే కురుక్షేత్ర యుద్ధం. సైన్సు, ఖగోళ శాత్రాల ఆధారంగా ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగి దాదాపు 5500 సంవత్సరాలయినట్టు నిర్ధారించారు. ఈ యుద్ధం జరిగిన కురుక్షేత్ర ప్రతుతం హర్యానా రాష్ట్రంలో ఉంది కౌరవులకు పాండవులకు మధ్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన ఈ రణరంగంలో మొత్తం నాలుగు లక్షల మంది సైనికులు చనిపోయినట్లు మన గ్రంధాలలో పేర్కొన్నారు. ఈ యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజులలో జరిగిన ప్రతి విషయాన్ని, ఎక్కడ ఎవరు ఎటునుండి ఎంతమంది ఏవిధంగా చనిపోయారో యుద్ధం ఎలా జరిగిందో ప్రతి గట్టాన్ని మన గ్రంధాలలో వివరించబడింది.
అయితే ఆ చనిపోయిన నాలుగు లక్షల మంది యుద్ద వీరుల అస్థికలు ఎక్కడ ఉన్నాయనేదే శేష ప్రశ్నగా మిగిలింది. మనకున్న సమాచారం ప్రకారం ఆ నలుగు లక్షల మంది అస్థికలు కనిపించక పోవడానికి రెండు కారణాలున్నాయి, మన మహాభారత గ్రంధాలలో పేర్కొన్నధాని ప్రకారం 1) ఈ యుద్ధం పూర్తయిన 18వ రోజు సాయంత్రం పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) చనిపోయిన వారందరిని యుద్ధ వీరులుగా గుర్తించి వారికి శాస్త్రక్తంగా దహన సంస్కారాలు నిర్వహించి వారి అస్తికలను మార్కండ నదిలో కలపమని ఆజ్ఞాపించాడు, అయితే వారి అస్థికలు నదిలో కలిపినప్పటికి నాలుగు లక్షల మంది సైనికులు చనిపోయారు కాబట్టి కొన్ని అవశేషాలు మిగిలి ఉంటాయి కనుక అవి ఎక్కడున్నాయి అనే ప్రశ్న ఉత్పన్నమయింది అయితే కొందరు జియాలజిస్టుల అంచనా ప్రకారం 2) కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఇప్పటికి 5500 సంవత్సరాలయింది. ఈ యుద్ధం జరిగిన కురుక్షేత్ర ప్రాంతంలోని అడవులకు మార్కందా నది తీర ప్రాంతానికి మధ్యనున్న విశాల ప్రాంతంలో జరగడం వలన ఈ మధ్య కాలంలో సంభవించిన అనేక విపత్తులు వాతావరణ మార్పుల వలన పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇసుక మట్టి పేరుకుపోయాయని, దీనికి తోడు ఆ ప్రాంతంలో మానవ నిర్మాణాలు చేపట్టడం వలన వాటిని గుర్తించాడం కష్టంగా మారిందని శాస్త్రవేత్తలు తెలిపారు,

2 thoughts on “కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయిన నాలుగు లక్షల మంది సైనికుల అస్థికలు ఎక్కడ ఉన్నాయి.?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!