ఆది. నవం 18th, 2018

సనాతన ధర్మాన్ని స్వీకరించిన అతిపెద్ద ముస్లిం దేశపు యువరాణి

బహుశా ఈ విషయాన్నీ చాలా మంది జీర్ణించుకోలేకపోవచ్చు, ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న హిందూ ధర్మానికి ఇదొక చక్కటి నిదర్సనం. దాదాపు 23 కోట్ల ముస్లిమ్స్ జనాభా కలిగి, ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ దేశమైన ఇండోనేసియా (జావా) యువరాణి “కంజేంగ్ రాదేన్ ఆయు మహేంద్రాని” ఆగమ సంప్రదాయ బద్ధంగా హిందూ మతాన్ని స్వీకరించారు.
ఇండోనేషియాలోని బాలి నగరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి చెందిన “పుర లుహుర్ చతుర ఖంద్ ఫట్ శారి” ఆలయంలో జరిగే హిందూ పవిత్ర కార్యక్రమమైన “సుది వధాని” లో పాలోగిని యువరాణి హిందూమతాన్ని స్వీకరించారు, ఇండోనేసియాలో ఇతర మతస్తులు హిందూ మతం స్వీకరించే కార్యక్రమాన్ని “సుది వధాని” అని అంటారు ఈ సందర్భంగా జావా యువరాణి “కంజేంగ్ రాదేన్ ఆయు మహీంద్రని” మాట్లాడుతూ ఇండోనేసియా లో పూర్వకాలం (మొదటి) నుండి ఉన్నది హిందు మతమేనని, తరువాత అరబ్బు దేశాతుల రాకతో ఇస్లాం దేశంగా మార్చబడిందని తెలియజేసారు. తను కొత్తగా హిందూ మతాన్ని స్వికరించాలేదని, తమ మాతృ ధర్మమైన హిందూమతాన్ని మరలా స్వికరించినందుకు చాల సంతోషంగా ఉందని తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!