ఆది. నవం 18th, 2018

షాకింగ్ న్యూస్ ఒకే వేదిక పై వద్ద తండ్రి, కూతురు బందోబస్తు అధికారులుగా…

హైదరాబాద్ : కొంగర కలాన్ ప్రగతి నివేదన సభ ప్రాంగణంలో ఓ ఆరుదైన సంఘట చోటు చేసుకుంది. ఒక వేదిక వద్ద తండ్రి, కూతురు బందోబస్తు అధికారులుగా విధులకు హాజరైయ్యారు.

కూతురు ఐపీఎస్‌గా… తండ్రి 33 ఏండ్ల సర్వీసు అనుభవంతో నాన్ క్యాడర్ ఎస్పీగా పదొన్నతి పోంది డీసీపీ విధులు నిర్వహిస్తున్నారు. ఇలా తండ్రి, కూతురు ఒకే చోట ఉన్నతాధికారులుగా విధుల నిర్వహించడం చాలా మంది పోలీసు అధికారులు దృష్టిని ఆకర్షించింది. ఆసక్తికరమైన తండ్రి,కూతుళ్ల విధుల దృశ్యాన్ని చూసిన చాలా మంది పోలీసు బాసులు మురిసిపోయారు.

ఇంతకి ఈ తండ్రి…కూతురు ఎవరో తెలుసా…మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ తండ్రి కాగా, జిగిత్యాల ఎస్పీ సింధూ శర్మ ఆయన కూతురు. ఈ ఇద్దరు ప్రగతి నివేదన ప్రాంగణంలో పోలీసు డ్యూటీ చేస్తున్నారు.

ఇందులో ఐపీఎస్ సింధూశర్మ సాంస్కృతిక వేదికతో పాటు మహిళలకు కేటాయించిన గ్యాలరీలకు ఇంచార్జీగా బాధ్యతలను అప్పగించారు. మొత్తం మహిళ పోలీసు సిబ్బందికి సూచనలు ఇస్తూ మహిళలకు బందోబస్తు నిర్వాహణపై ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

ఇక మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ సభా వేదిక వద్ద బందోబస్తుకు ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ 1985 సంవత్సరంలో ఎస్‌ఐగా పోలీసు ఉద్యోగంలో చేరి అంచెఅంచెలుగా ఎదిగి నాన్‌క్యాడర్ ఎస్పీ హోదాకు వచ్చి ప్రస్తుతం మల్కాజిగిరి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సింధూశర్మ 2014 బ్యాచ్ ఐపీఎస్‌గా ఎంపికై మొదటి పోస్టింగ్ పెద్దపల్లి చేసి రెండు రోజుల కిందట జగిత్యాల ఎస్పీగా పోస్టింగ్‌ను పొందింది. ఈ విధంగా పోలీసు డ్యూటీలో భాగంగా తండ్రి నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో ఐపీఎస్ అధికారిని కూతుర సింధూ శర్మకు సెల్యూట్ చేయడం అరుదైన అంశంగా అందరీకి ఆనందాన్ని ఇచ్చింది.

 నాకు చాలా గర్వంగా ఉంది…సింధూ శర్మ, జగిత్యాల ఎస్పీ నేను చాలా గర్వపడుతున్నా…మా నాన్నతో కలిసి ఒకే ప్రాంగణంలో పోలీసు విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.

ప్రగతి నివేదన సభతో నాకు ఈ అవకాశం దొరకడం చాలా అదృష్టం. చాలా సంతోషం…ఉమామహేశ్వరశర్మ, డీసీపీ మల్కాజిగిరి
ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.

ప్రజా భద్రత కోసం పాటుపడే పోలీసు వృత్తిలో బంధాలు కన్నా మొదట వృత్తి ముఖ్యం. ఆ నేపధ్యంలోనే తండ్రి, కూతుళ్ళం ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం. ఈ అవకాశం దక్కడం అదృష్టం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!