ఆది. నవం 18th, 2018

కర్ణాటకలో త్వరలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయ్యనుందా..?? ఆచితూచి అడుగులు వేస్తున్నభాజపా

 

బెంగళూరు :   కర్ణాటకలో కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి గండాలు తప్పడం లేదు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ చాణక్య నీతితో అవలంబించిన ఆలోచన విధానం ద్వారా  తాజాగా 12 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోతామని జార్కిహొళి సోదరులు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని గట్టిగా హెచ్చరించారు.
బెళగావి రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇదే వైఖరి కొనసాగితే తమకు సన్నిహితులైన 12 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరుతామని అల్టిమేటం జారీ చేశారు.  బెళగావి జిల్లాకు చెందిన సతీశ్‌ జార్కిహొళి, రమేశ్‌ జార్కిహొళి కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ మధ్య పీఎల్‌డీ బ్యాంకు ఎన్నికల విషయమై వివాదం చోటు చేసుకుంది.
వీరిలో లక్ష్మి, సతీశ్‌ ఎమ్మెల్యేలు కాగా, రమేశ్‌ మంత్రి. దీంతో బ్యాంకు విషయంలో పట్టుకోసం వీరు పాకులాడుతున్నారు. ఇదే విషయమై పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి వేణుగోపాల్‌కు లక్మి ఫిర్యాదు చేశారు. పట్టువీడాలంటూ జార్కిహొళి సోదరులకు వేణుగోపాల్‌ సూచించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తరఫున వత్తాసు పలుకుతున్నారని వేణుగోపాల్‌ను నిందించారు.

1 thought on “కర్ణాటకలో త్వరలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయ్యనుందా..?? ఆచితూచి అడుగులు వేస్తున్నభాజపా

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!