ఆది. నవం 18th, 2018

 ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం.. అక్టోబర్ 31న ఆవిష్కరణ..

భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్ రాష్ట్రంలో  విగ్రహం ఏర్పాటవుతోంది.  విగ్రహం ఎత్తు దాదాపుగా  182 మీటర్లు.. అంటే 600 అడుగుల ఎత్తు

చైనాలోని ‘స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ’ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీని ఎత్తు 128 మీటర్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన ప్రాజెక్టుగా పరిగణిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్‌ విగ్రహం  ఐక్యతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)గా పిలుస్తున్న దీన్ని అక్టోబర్ 31వ తేదీన మోదీ ఆవిష్కరించనున్నారు.

1947లో భారతదేశానికి స్వతంత్రం లభించిన తర్వాత దేశ ఉప ప్రధానిగా పటేల్ పనిచేశారు.

అప్పట్లో భారతదేశంలో కలిసేందుకు విముఖంగా ఉన్న, విభేదిస్తున్న పలు రాష్ట్రాలను జాతీయవాది అయిన పటేల్‌ ఒప్పించి, ఏకం చేసి భారతదేశంలో ఐక్యం చేసినందుకు.. ఆయన్ను భారత దేశ ఉక్కు మనిషి (ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా) అని కూడా పిలుస్తుంటారు.

భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నెహ్రూ వంశం పట్ల పక్షపాతం వల్ల చరిత్రలో సర్దార్ పటేల్‌కు సముచిత స్థానం లభించలేదని చాలామంది దేశ ప్రజలు భావిస్తుంటారు

సుమారు 153 మీటర్ల ఎత్తులో ఉండే పటేల్ విగ్రహ ఛాతి భాగంలో గ్యాలరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

పటేల్ విగ్రహం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెరుగుతారని దీనివల్ల రాష్ట్రానికి ఆర్ధిక లావాదేవీలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. అహ్మదాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!