బుధ. డిసెం 12th, 2018

భారతదేశంలో ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ చైనా లో ఎందుకు ప్రజా హక్కుల్ని కాలరాస్తుంది..?

భారతదేశం లో ప్రజల బావోద్వేగంగ చెలగాటం ఆడుతూ పైకి ప్రజా హక్కుల కోసం ఏదో పోరాటం చేసేస్తున్నాం అంటూ ప్రచారం చేసుకుంటున్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులూ, ఆ పార్టీ అధికారంలో ఉన్న దేశంలో మాత్రం ప్రజల దినచర్య అలవాట్లలలో కూడా జోక్యం చేసుకుంటూ ప్రతి విషయంపై తీవ్ర ఆంక్షలు విధిస్తుంది అనడానికి చైనా అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిదర్శనం.

చైనాలో ఇంటర్నెట్‌‌పై కఠిన ఆం‌‌క్షలు

ప్రతి అయిదేళ్లకు ఓ సారి చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నియంత్రిస్తోంది.  అక్కడి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినా లేదా వారికి వ్యతిరేకంగా మాట్లాడినా బ్లాక్ చేస్తోంది.  చివరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఫన్నీ స్టిక్కర్లను చాటింగ్ గ్రూపుల్లో పంపించినా వాటిని బ్లాక్ చేస్తున్నారు. వీచాట్.. చైనాలో వాడే చాటింగ్ అప్లికేషన్. ఆ చాటింగ్ అప్లికేషన్‌లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడే కొన్ని పదాలు ఉండవు.

 

ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్‌ను ఎవరూ తమ అధీనంలోకి తీసుకోలేరని చాలా మంది అంటుంటారు. కానీ చైనా ప్రభుత్వం మాత్రం ఇంటర్నెట్‌ పై ఆంక్షలు విధించి ప్రజల హక్కుల్ని కలరాస్తుంది.

ఇంటర్నెట్‌ను చైనా ఇంట్రానెట్ రూపంలో అందిస్తుంది. అంటే పరిమితంగానే నెట్ ఇస్తుంది. చైనాలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి వెబ్ సైట్లు పనిచేయవు.  అక్కడ అవి వీపీఎన్ ద్వారానే పనిచేస్తాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల సందర్భంగా చైనా ఈ వీపీఎన్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. చైనీస్ అప్లికేషన్ స్టోర్ నుండి అన్ని వీపీఎన్‌లను తొలగించాలని యాపిల్ కంపెనీని చైనా ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు గూగుల్‌లో ఏం శోధిస్తున్నారో తెలుసుకునేందుకు తమను అనుమతించాలని ఆ కంపెనీని కోరింది. కానీ గూగుల్ కాదనడంతో ఆ సంస్థను అక్కడ నిషేధించారు. ఇలా చైనాలో ఇంటర్నెట్ కూడా అక్కడి గ్రేట్ వాల్ లానే దుర్భేద్యంగా ఉంటుంది.

 

మీడియాపై అతి నియంత్రణ

చైనాలో ఉన్న ప్రతీ దినపత్రిక, టీవీ చానెల్ అక్కడి ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. గతేడాది చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పీపుల్స్ డైలీ న్యూస్ పేపర్, జిన్హువా, ప్రభుత్వ ప్రసారక ఛానెల్ సీసీటీవీ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా టీవీ రిపోర్టర్లు చైనా ప్రభుత్వానికి సంపూర్ణ విధేయత చూపించాలని అన్నారు. కేవలం సున్నితమైన అంశాలే కాకుండా మీడియాలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలలోనూ ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ఆన్ లైన్ బుక్ స్టోర్లు కూడా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను అనుగుణంగా కార్యకలాపాలను నిర్వహించాలి.  చైనాలో ఎలాంటి కార్యక్రమాలు టీవీలో ప్రసారమవ్వాలో, ప్రసారం కాకూడదో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.  గతంలో అక్కడి ప్రసార మాధ్యమాలకు విదేశీ ప్రదర్శనలు ప్రసారం చేయొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.

ప్రముఖుల కుంభకోణాలను వివరించే బ్లాగులు కూడా మూతబడ్డాయి 

ఆలోచించదగ్గ విషయం ఏమనగా అదే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులూ భారతదేశంలో ప్రజ హక్కుల కోసం అంటూ పోరాటం చేస్తూ కొన్ని రాష్ట్రాలలో అధికారం వచ్చిన తరువాత తమ నిజ స్వరూపం చూపిస్తున్నారు ఉదాహరణకు “కేరళ రాష్ట్రము” కేరళ లో మైనార్టీ, మెజారిటీ అంటూ ప్రజలను మత ప్రతిపాదనగ వేరు చేస్తూ దేశ ఐఖ్యతను బంగం కలిగించే దిశకు తిసుకువేల్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!