బుధ. డిసెం 12th, 2018

పెట్రోల్ ధరలు పెరుగుదలకు కారకులు ఎవ్వరు…? విదేశాల నుండి భారీగా అప్పు తీసుకుంది ఎవ్వరు..?

చమురు బ్యారెల్ ధర 100 డాలర్లు ఉన్నా కూడా UPA 78 రూపాయలకే లీటర్ ఇచ్చింది అంటున్నారు ఎలా ఇచ్చింది..? సోనియాగాంధీ ఏమైనా ఇటలీ నుంచి తెచ్చి పెట్టిందా..?? లేకపోతే రాహుల్ గాంధీ సంపాదించి పెట్టిండా..?

నోటికి ఏది వస్తే అదే రాసేయ్యడం, ఫోన్ ఉంది ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఎకౌంటు ఉందని ప్రతి ఒక్కరు తమ ఇష్టానుసారం రాసిన పోస్టులను కాపీ పేస్టు చెయ్యడం, మేధావులు వాలే పోజులు కొట్టడం.

UPA పాలనలో ఇరాన్ నుంచి తెచ్చిన( మీరు చెప్పే బ్యారెల్ రేటు 100 ఉన్నది కానీ ) వాటికి రూ లక్ష 42 వేల కోట్ల రూపాయల ఉద్దెర (అప్పు) ఖాతా పెట్టి దేశం ఇజ్జత్ తీశారు. ఉద్దెర ఎందుకు అంటే, ధరలు పెంచితే జనాల నుంచి నిరసన వస్తుంది కదా దానినుండి తప్పించుకోవడానికి ఇరాన్ కు డబ్బులు ఇవ్వకుండా చమురుని దిగుమతి చేసుకున్నది.!

లేకపోతే అప్పుడే లీటర్ 100 రూపాయలు దాటేది సన్నాసుల్లారా..! ఇక నరెంద్రమోదీ వచ్చాక మరి ఆ రూ లక్ష 42 వేలకోట్ల రూపాయల అప్పుని మొదట సంవత్సరంలోనే తీర్చేశాడు.

సర్దుబాటు చేసిన ఆ సొమ్ముని ఎవరు చెల్లించాలి.?? నరెంద్రమోదీ ఏమైనా నెహ్రూ కుటుంబమా..? వేల కోట్లు వెనకేసుకున్నవాడా..?? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కట్టే పన్నులే ప్రజల అవసరాలను తీరుస్తాయి. కాబట్టి బ్యారెల్ ధర తగ్గినప్పటికీ ధరలు తగ్గించలేకపోయారు. దీనికి ఇంకో కారణం కూడా ఉన్నది, UPA పోతూ పోతూ రోజువారీ ధరల సవరణ ను తెచ్చింది. ఇకపోతే ఇప్పుడున్న ధరల ప్రకారం పెట్రోల్ పై వేస్తున్న పనుల్లో దాదాపు 75%

(36 రూపాయలు) రాష్ట్రాలు విధిస్తున్న పన్నులే.

అడ్డగోలుగా అదనపు పన్నులు వేస్తూ ధరల పెరుగుదలకు రాష్ట్రాలు పరోక్ష కారణం అవుతున్నాయి. కానీ జనాలు మాత్రం కేంద్రం ధరలు పెంచుతుందని అపోహపడుతున్నారు.

ఇక ఇతర పార్టీల కార్యకర్తలు, కూడా కేంద్రాన్ని బదనం చేస్తూ చెత్తరాతలు రాస్తున్నారు. ( వీళ్లకు 0% అవగాహన కూడా ఉండదు) 2003 లో 23 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ధరను, 2014 లో 78 రూపాయల వద్ద NDA కు అప్పగించారు,   రూ లక్ష 42 వేల కోట్ల అప్పుతో.. దేశ ప్రజలు ఆలోచించ వలసిన తరుణం ఇది ప్రతి ఒక్కరు కేంద్రం చేస్తున్న ఎన్నో అభివృద్ధి పధకాలు నడుస్తున్నాయి వాటికి నిధులు కొరత ఉన్న, అంతర్జాతీయ మార్కెట్ లో మన దేశపు రూపాయి విలువ భారీగా పడిపోయిన ఆ భారాన్ని కేంద్రం దేశ ప్రజలపై పడనివ్వలేదు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!