ఆది. నవం 18th, 2018

కాషాయ గూటికి మరో యోగి.. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా భాజపా…

బీజేపీలోకి స్వామి పరిపూర్ణ నంద చేరడం తధ్యం అనట్టు వాతావరణం కనిపిస్తుంది.  ఇటీవల నగర బహిష్కరణకు గురై మొన్ననే తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన స్వామి పరిపూర్ణానందకు కాషాయ కండువా కప్పడం ద్వారా తెలంగాణలో మజ్లిస్ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చని బీజేపీ భావిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లా జాతీయ వాదంతో  ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే సమ్మోహనశక్తి పరిపూర్ణానందకు ఉందని ఆర్.ఎస్.ఎస్  వర్గాలు కూడా భావిస్తున్నాయి.

పరిపూర్ణానంద స్వామిని పార్టీలోకి ఆహ్వానించడంపై ఇటీవల మోహన్ భగవత్ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనూ చర్చించినట్టు తెలుస్తోంది.

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే  అంశంపై వాతావరణం వేడెక్కడంతో, పోలీసులు స్పందించి తొలుత కత్తి మహేశ్‌ను, ఆ తర్వాత పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించారు.  55 రోజుల బహిష్కరణ తర్వాత స్వామి భారీ ర్యాలీతో రెండు రోజుల క్రితం నగరంలో అడుగుపెట్టారు. ఆయినకు సదరు స్వాగతం పలికిన తెలంగాణా రాష్ట్ర బిజెపి నాయకులూ

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!