ఆది. నవం 18th, 2018

తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది ఏడాదికి 1000.. జాతీయ మీడియా వెల్లడి..

 

ఆంధ్రప్రదేశ్ గుంతకల్లు మునిసిపాలిటీలోని ఓ కాలనీలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఆదివారం అర్ధరాత్రి భర్త, పిల్లలతో కలిసి ఆమె గాఢనిద్రలో ఉంది. టీడీపీకి చెందిన ఆ వార్డు కౌన్సిలర్‌ అన్వర్‌బాషా ఆమె ఇంట్లోకి చొరబడి.. ఆమెను నిద్రలేపాడు. ‘ఎందుకొచ్చావ్‌.. ఇప్పుడేం పని’ అంటూ ఆమె నిలదీయడంతో కౌన్సిలర్‌ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. భర్త నిద్రలేచే సరికి కౌన్సిలర్‌ అక్కడి నుంచి పరుగు లంకించాడు.

ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణలో ఎలాంటి ముందడుగు వెయ్యలేదు అంటూ జాతీయ స్థాయి మీడియా ప్రశ్నించింది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 2014 నుండి 2018 మధ్య ఏడాదికి 1000 మహిళలపై కీచక మానవ మృగాలు  అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు, వెల్లడించింది

మహిళల పట్ల స్వయానా తెలుగుదేశం పార్టీ కి చెందిన గుండాలే ఇలాంటి దారుణానికి పాల్పడుతున్నట్లు జాతీయ మీడియా ప్రచారించడంతో, రాష్ట్ర ప్రజల్లో భయంకరమైన వాతావరణం ఏర్పడింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!